Monday, 2 November 2026

అంతర్‌ జిల్లాల దొంగలముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ : ఇళ్లలో వరుస దొంగతనాలు చేస్తున్న అంతర్‌ జిల్లాల దొంగల ముఠాను కృష్ణా జిల్లా గుడివవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠా పశ్యిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై అనేక కేసులు ఉన్నాయని డీఎస్పీ సీతారామ స్వామి తెలిపారు. నిందితుల నుంచి పది కాసుల బంగారం, వెండి వస్తువులు, ఒక ఆటో, ఒక ద్విచక్ర వాహనం సహా రూ. 3.25 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *