Monday, 2 November 2026

రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం తగ్గింది : డీజీపీ ప్రసాదరావు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో నక్సల్స్‌ ప్రభావం గణనీయంగా తగ్గిందని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ ఏడాదిలో 163 మంది నక్సల్స్‌ను అరెస్టు చేశామని, మరో 76 మంది లొంగిపోయారని వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్లను అణచి వేసేందుకు 531 కేసులు యమోదు చేసి 3,249 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాదిలో 40,384 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, గతంతో పోలిస్తే 6.45 శాతం మేర రోడ్డు ప్రమాదాలు పెరిగాయని డీజీపీ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్‌ జరిమానాలు రూ. 123 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆందోళనల దృష్ట్యా భద్రతా చర్యలు పెంచినట్లు తెలిపారు. 95 కంపెనీల కేంద్ర పారామిలటరీ, 35 కంపెనీల ఏపీఎస్పీ బలగాలు మోహరించినట్లు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *