Monday, 2 November 2026

భూమ్మర్ధి అక్రమ నిర్మాణాన్ని పరిశీలించిన చంద్రబాబు

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌లో జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేసిన కడప మాజీ మేయర్‌ రవీంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశీలించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 2లో ఉమెన్‌ వెల్ఫేర్‌ సొసైటీ స్థలాన్ని రవీంద్రనాధ్‌ రెడ్డి ఆక్రమించి ఇల్లు నిర్మించారని హైకోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్యివేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రవీంద్రనాథ్‌ ఇంటటిని చంద్రబాబు పరిశీలించి బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవీంద్రనాథ్‌ రెడ్డి అక్రమ నిర్మాణంపై నీరజారావు. స్థానికులు చంద్రబాబుకు వివరించారు. తెదేపా నగరశాఖ అధ్యక్షుడు తలసాన శ్రీనివాస యాదవ్‌, పలువురు తెదేపా నాయకులు చంద్రబాబు వెంట ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *