Tuesday, 3 November 2026

ప్రైవేటు ట్రావెల్స్‌ కార్యాలయాలపై ఆర్టీఏ దాడులు

హైదరాబాద్‌ : ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కార్యాలయాలపై రెండో రోజు కూడా రవాణా శాఖ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, విజయవాడలోని ట్రావెల్స్‌ కార్యాలయాలపై మంగళవారం ఉదయం ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారల తనిఖీల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ అక్రమాలు భారీగా వెలుగుచూసినట్లు సమాచారం. ఇప్పటి వరకు 42 ట్రావెల్స్‌ కార్యాలయాలపై దాడులు నిర్వహించిన అధికారులు రికార్డులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ దాడుల సమాచారంతో హైదరాబాద్‌లో ట్రావెల్స్‌ సిబ్బంది కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *