హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నిమ్మల గార్డెన్స్‌లో పసుపు రైతుల మహాగర్జన ప్రారంభమైంది. ‘పసుపు రైతుల మహాగర్జన సభ’ కు జాతీయ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు దైవసిగామణి హాజరయ్యారు. సభకు హాజరైన ముఖ్య అతిథులకు సంఘాలు పసుపు కొమ్ముల దండలతో వినూత్నంగా స్వాగతం పలికారు.




