హైదరాబాద్ : సీమాంధ్రలోని 13 జిల్లాల ఎమ్మెల్యేల నుంచి అఫిడవిట్లు తీసుకుని రాష్ట్రపతికి నివేదిస్తామని ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ… విభజన బిల్లు విషయంలో అసెంబ్లీ ముట్టడి, నేతల నిర్బంధంపై పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మధ్యంతర భృతిపై రెండ్రోజుల్లో సీఎం నిర్ణయం ప్రకటించే అవకాశముందని అశోక్ బాబు తెలిపారు.




