సత్తుపల్లి : ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారుగూడెంలో లాయర్ జిన్నింగ్ మిల్లు అగ్ని ప్రమాదానికి గురైంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. ఇంకా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదు.




