Monday, 2 November 2026

శ్రీవారిని దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఈ రోజు తిరుమల విచ్యేసి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుమల వచ్చిన ఆయన నేరుగా ఆలయానికి చేరుకుని అఘుదర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆయనకు తితిదే అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దేశం ప్రగతి పథాన సాగాలని, దేశ ప్రజలంతా శాంతి సౌభ్రాతృత్వాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చౌహాన్‌ తెలిపారు. ప్రజలందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *