హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రానికి అన్ని ప్రాంతాలకు భవిష్యత్తు చేపే నాయకత్వం కావాలని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. లోక్‌సత్తా పార్టీ కార్యలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏం మాట్లడితే ఏమవుతుందోనన్న పరిస్థితి తొలగాలని ఆకాంక్షించారు. పదవులు, అధికారం, దోపిడీ కోసం పనిచేయడానికి పార్టీలు స్వస్తి పలకాలన్నారు. వైఎస్సే రాష్ట్ర విభజనకు నాంది పలికారన్న జేపీ అందరినీ కూర్చోబెట్టి పరిష్కరించాలన్న ఙ్ఞానాన్ని కేంద్రం ప్రదర్శించలేకపోయిందన్నారు. కుమారులు, కుమార్తెలకు అధికారం కట్టబెట్టాలన్న యావ కొందరు నాయకులకు ఉందని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్లలో జరిగిన పరిణామాలు అనివార్యమైన పరిస్థితులకు దారిదీశాయని జేపీ అన్నారు.




