హైదరాబాద్ : మంత్రుల శాఖలు మార్చడం ముఖ్యమంత్రికి ఉన్న ఆధికారాల్లో భాగమని ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నాను. మంత్రి ఆనం బుధవారం ఉదయం రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ …ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. మంత్రి జానారెడ్డి విమర్శలు చేయకుండా నేరుగాసీఎంతోమాట్లాడితే బాగుండేదన్నారు.




