Monday, 2 November 2026

న్యూజిలాండ్‌ ఘనవిజయం

క్వీన్స్‌టౌన్‌ : న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన వన్డేలో జిలాండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 21 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. 284 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ 21 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్‌ 159 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా 50 ఓవర్ల మ్యాచ్‌ను 21 ఓవర్లకు కుదించారు. నూతన సంవత్సరం తొలి రోజున న్యూజిలాండ్‌ ఆటగాడు కొరి అండర్సన్‌ 36 బంతుల్లో 100 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌ జట్టు అద్భుత విజయం సాధించి రెట్టింపు ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *