హైదరాబాద్ : నూతన సంవత్సరం సందర్భంగా జంటనగరాల్లో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జామునే ఆలయాలకు చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వరస్వామి కొలువైనబిర్లాటెంపుల్ , బంజరాహిల్స్‌లోని పూరి జగన్నాథ్ ఆలయాలు భక్తుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సరం అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటూ భక్తులు పూజలు చేశారు.




