Monday, 2 November 2026

మోకాలికి మూలకణ చికిత్స

హైదరాబాద్‌ : దెబ్బతిన్న మోకాలి కార్డిలేజ్‌ను మూలకణ చికిత్సతో పునరుత్పత్తి చేయవచ్చని సౌత్‌కొరియాకు చెందిన డాక్టర్‌ ఎస్‌. కె. కిమ్‌ అన్నారు. కార్డిలేజ్‌ లోపాలతో కీళ్లు అరిగి నడవలేకపోతున్న వ్యక్తికి మెడిసిటీ ఆస్పత్రిలో మూలకణ చికిత్స చేసి వైద్యులు విజయం సాధించారు. ఈ శస్త్ర చికిత్సకు డాక్టర్‌ కిమ్‌తో పాటు యూకేకి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు డాక్టర్‌ ఎ.ఎ. శెట్టి నేతృత్వం వహించారు. నల్గొండ జిల్లాకు చెందిన భూపతిరెడ్డి అనే 40 ఏళ్ల వ్యక్తికి ఆగస్టులో ప్రయోగాత్మకంగా మూలకణ చికిత్స చేశారు. తాజాగా ఆ వ్యక్తి మోకాలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కార్డిలేజ్‌ లోపాలు, ఆస్టియో అర్థరైటిస్‌తో బాధపడేవారికి మూలకణ చికిత్స ద్వారా పూర్తి ఆరోగ్యం కల్పించవచ్చని ఇది ఇప్పుడిప్పుడే భారత్‌లో ఆదరణ పొందుతున్న విధానామని మెడిసిటీ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ కె. కృష్ణయ్య చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *