హైదరాబాద్ :నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 24వేల ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలని యాజమాన్యానికి ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రైవేటు బస్సుల వేగాన్ని నిరోధించడం, మద్యం సేవించే డ్రైవర్లపై టోల్‌గేట్ల వద్దనే నిఘా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంపై కమిటీ నివేదిక పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని వివరించింది.




