హైదరాబాద్ : రెండు సార్లు వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. సభ ప్రారంభమైన వెంటనే ఇరు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సభ నిర్వహణకు సహకరించాలని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టు విక్రమార్క పదే పదే విఙ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.




