అరండల్ పేట : రాష్ట్ర విభజన బిల్లుకు వ్యతిరేకంగా సమైక్యంగా విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలోసర పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ విభజన పై ఉద్యమిస్తున్న ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం దారుణమన్నారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి నష్టం చేకూరేలా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాయపాటి శ్రీనివాస్, విద్యార్థి ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ అల్లూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.




