Tuesday, 3 November 2026

రైతుల భూములన్నీ కేసీఆర్‌కు ఇవ్వాలి : చంద్రబాబు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో రైతులంతా తమ భూముల్ని కేసీఆర్‌కు ఇచ్చి ఎకరాకు రూ. 5లక్షల ఆదాయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. కేసీఆర్‌ తన పద్ధతిలో వ్యవసాయం చేసి ఎకారాకు రూ. 5 లక్షల చొప్పున రైతులకిచ్చి మిగతా రూ. 95 లక్షలు తాను తీసుకుంటే రాష్ట్రంలోని రైతులంతా బాగుపడతారని అభిప్రాయపడ్డారు. శనివారం అసెంబ్లీ లాబీలో చంద్రబాబు మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు….కేసీఆర్‌ చెప్పినంత మాత్రాన ఎకరాకు కోటి రూపాయల ఆదాయం ఎలా వస్తుందో విలేకరులకు ఆ మాత్రం ఆలోచన లేకుండా వార్తలు రాస్తారా అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాంతంలో రైతులంతా గిట్టుబాటు ధర లేకుండా కన్నీరు పెడుతుంటే కేసీఆర్‌ తానొక్కడినే లాభపడ్డాననడం అవినీతి నల్లదనాన్ని తెల్లధనంగా మార్చుకునే ప్రక్రియ కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *