Tuesday, 3 November 2026

నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం

హైదరాబాద్‌ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయుగుండం ప్రస్తుతానికి నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రేపు సాయంత్రం శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల వరకు మన రాష్ట్రంపై దీని ప్రభావం ఏమాత్రం ఉండదని నిపుణులు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *