హైదరాబాద్ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీ లో ఇంకా చర్చ ప్రారంభం కాలేదని, సోమవారం నుంచి ప్రారంభమవుతుందని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ లాబీలో సీఎం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పార్టీలన్నీ వారివారి అభిప్రాయాలు సభలో చెబితేనే… పరిగణలోకి తీసుకుంటారన్నారు. అసెంబ్లీలో చర్చ ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిదని వ్యాఖ్యానించారు. ఓటింగ్ లేకుండా అభిప్రాయం చెప్పడంలో అర్ధం లేదని, దేశంలో ఎక్కడైనా ఓటింగ్ జరగకుండా రాష్ట్రం ఏర్పడిందా అని ప్రశ్నించారు. విభజన జరిగితే రెండు ప్రాంతాలకు నష్టమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు. శ్రీధర్‌బాబు రాజీనామా లేఖ తనకు అందిందని చెప్పారు. నా పాలన తెరచిన పుస్తకం….ఆరోపణలు చేసేవారు ఆధారాలతో రావాలని సవాల్ విసిరారు. తాను సీఎం అయ్యాక 30 మంది నాయకులు కాంగ్రెస్ వీడారని, పార్టీ నుంచి వెళ్లాలని నిర్ణయించుకున్న వారిపై ఎలా ఒత్తిడి తేగలమని పేర్కొన్నారు. తాను పార్టీ పెడుతున్నానంటూ వస్తున్న వార్తలు వూహాగానాలేనని సీఎం కొట్టిపారేశారు.
ఓటింగ్ లేకుండా ఏ రాష్ట్రం ఏర్పడలేదు : సీఎం




