అరండల్ పేట(గుంటూరు) : రాష్ట్ర విభజన బిల్లు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ఆందోళనలు మిన్నంటాయి. గుంటూరు లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద విద్యార్థులు భారీ మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ….కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరించడం దారుణమన్నారు. విభజన బిల్లు సీమాంధ్ర ప్రాంతానికి నష్టం చూకూర్చేలా ఉందన్నారు. రాయపాటి శ్రీనివాస్, విద్యార్థి ఐకాస రాష్ట్ర కో కన్వీనర్ అల్లూరి వెంకటరమణ తదితరలు పాల్గొన్నారు.
గుంటూరులో సమైక్య ఆందోళనలు





