రాయితీ సిలిండర్లను పెంచే ప్రతిపాదనేదీ లేదు : మొయిలీ

న్యూఢిల్లీ : రాయితీ గ్యాస్‌ సిలిండర్లను 9 నుంచి 12కు పెంచే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర మంత్రి మొయిలీ చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి చిదంబరం సిలిండర్ల సంఖ్యను 12కు పెంచాలన్న డిమాండ్‌ను పరిశీలిస్తున్నట్లు గురువారం వెల్లడించిన సంగతి తెలిసిందే.