Tuesday, 3 November 2026

అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం : డొక్కా మాణిక్య వరప్రసాద్‌

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకున్నా, క్రమ శిక్షణ గల పార్టీవాదిగా అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవిస్తానని తెలిపారు. ఉపాధి పనుల్ని పరిశీలించేందుకు ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కట్వకుర్తి, అచ్చంపేట నియోజక వర్గాల్లో పర్యటిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలకు డబ్బులు సక్రమంగా పంపిణీ అయ్యేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *