Tuesday, 3 November 2026

ఆటపాటలతో మురిపించిన చిన్నారులు

హైదరాబాద్‌ : రంగురంగుల దుస్తులు ధరించి, పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ బుడతలు ఆకట్టుకున్నారు.మధ్యమధ్యలో కుంగ్‌ఫూ, విన్యాసాలు, సైకిల్‌ రేసింగ్‌ తో ఆహూతుల దృష్టిని తమవైపు తిప్పుకున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ పాటుపడాలని చెబుతూ ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాల పై ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. యూసుఫ్‌ గూడలోని దక్ష కిడ్స్‌ పాఠశాల వార్షిక క్రీడోత్సవాన్ని స్థానిక కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. పిల్లల ప్రదర్శనలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. పాఠశాల ప్రిన్సిపల్‌ అనిత, ఇన్‌చార్జి రాధిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.                    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *