హైదరాబాద్: ఆటోలో వెళ్తున్న యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కూకట్‌పల్లిలోని నిజాంపేట్‌లో నివసించే శ్రీనివాస్‌రాజు మాదాపూర్‌లో ఓ ప్రైవేట్ సంస్థలో సాప్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఈ రోజు ఉదయం ద్విచక్రవాహనం పై వెళ్తూ కూకట్ పల్లి వద్ద ఆటోలో వెళ్తున్న ఇద్దరు యువతులను అటకాయించి అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ది చేసి పోటీసులకు అప్పగించారు.




