Tuesday, 3 November 2026

భయం వద్దు , నా జీవన రేఖ పొడుగ్గా ఉంది: అరవిద్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీ : వీఐపీ సంస్కృతిలో తిలోదకాలివ్వడం తమ విధానాల్లో ముఖ్యమైనదనిచెప్పడమే కాక అక్షరాలా ఆచరిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ అంశంపై రోజూ వార్తల్లోనే ఉంటున్నారు. తన భద్రత గురించి ఆందోళన చెందవద్దని పోలీసులకు తాజాగా మరోసారి చెప్తూ ఆయన తన జీవన రుఖ పొడుగ్గా ఉందంటూ చేయి చూపించి సరదాగా వ్యాఖ్యానించారు.పలువురి ఒత్తిడికి తలొగ్గి తొలుత ఇల్లు మారడానికి అంగీకరించిన కేజ్రీవాల్‌ తిరిగి శ్రేయోభిలాషులు ఇచ్చిన సూచనల మేరకు దానిని తిరస్కరించారు. ఇంతకన్నా చిన్న ఇల్లు చూడమని అధికారులకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *