వాషింగ్‌ మిషన్లో ఇరుక్కుపోయిన బాలిక

న్యూయార్క్‌ : సోదరి బట్టలు ఉతుకుతుండగా ఆమె వెంట ఆడుకుంటూ తిరుగుతూ ప్రమాదవశాత్తు వాషింగ్‌ మిషన్లో ఇరుక్కు పోయింది ఓ 11 ఏళ్ల బాలిక. సుమారు గంటన్నర పాటు ఆ బాలిక మిషన్లో ఇరుక్కు పోవడంతో బాలిక తల్లి అత్యవసర సేవా విభాగం నెంబర్‌ 911కు ఫోన్‌ చేసింది. వారు వచ్చి బాలికను రక్షించారు. ఈ ఘటన న్యూయార్క్‌ నగరంలోని ఉతాహ్‌ (సాల్ట్‌ లేక్‌ సిటీ) లో చోటుచేసుకుంది.