హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుతం ఇది తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయ దిశలో 230కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదిలి సాయంత్రం శ్రీలంక వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణం విభాగం ప్రకటించింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో తమిళనాడులో పలుచోట్ల వానలు, కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయి.




