హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో భేటీ అయ్యారు. ఒప్పంద ఉద్యోగుల సర్వీసులు క్రమబద్దీకరించాలని ఆయన కోరారు. లక్షలాది మంది ఒప్పందకార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటారని సీఎస్ దృష్టికి తెచ్చిన కేటీఆర్ వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.




