Tuesday, 3 November 2026

మాటలు జాగ్రత్తగా ఉపమోగించాలని ప్రధానికి పవార్‌ సూచన

ఢిల్లీ : మోడీని విమర్శించే క్రమంలో మాటలు జాగ్రత్తగా వాడాలని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సూచించారు. రాజకీయ ప్రత్యర్థులపై బలమైన పదాలు వాడకూడదన్నారు. ‘రాజకీయంగా శత్రువులైనా, మిత్రులైనా …వారికి మద్దతుగా మాట్లాడినా, వ్యతిరేకిస్తున్నా .. నేను నా పదాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటాను. ఎవరైనా అలాగే చేచాలి…’అని శరద్‌పవార్‌ పేర్కొన్నారు. పవార్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్‌ తివారీ తాను పవార్‌ అభిప్రాయాన్ని గౌరవిస్తానని అయితే ప్రధాని వ్యాఖ్యలతో ఏకీభవిస్తానని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *