తిరుమల : చెన్నైకి చెందిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారికి రెండు బస్సులను కానుకగా ఇచ్చాడు. చెన్నైకి చెందిన సెంతిల్ కుమార్ రూ. 46 లక్షల విలువైన బస్సులను మంగళవారం తితిదేకి అప్పగించారు. తిరుమలలో భక్తుల ఉచిత ప్రయాణం కోసం ధర్మ రథాలను తితిదే నడుపుతుంది. ఈ బస్సులను కూడా తితిదే భక్తుల సేవకు ఉపయోగించనుంది. తితిదే ఈవో గోపాల్‌కు దాత సెంతిల్ కుమార్ బస్సులను అందజేశారు.




