హైదరాబాద్ : సినీనటుడు ఉదయ్ కిరణ్ రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు ఫోరెన్సిక్ ప్రాథమిక నివేదికల్లో వెల్లడైంది. ఉరివేసుకునే ముందు ఆయన చేతి మణికట్టు వద్ద నరాలు కోసుకునే ప్రయత్నం చేశారని ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంటోంది. భార్య విషిత, ఉదయ్‌కిరణ్ కాల్ డేటాలను తెప్పించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆత్మహత్యకు ముందు భార్య విషిత నుంచే ఉదయ్ కిరణ్‌కు సంక్షిప్త సందేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.




