Tuesday, 3 November 2026

రాజకీయాలు దిగజారడానికి శాసనసభే నిదర్శనం : జేపీ

హైదరాబాద్‌ : రాజకీయాలు ఎంతగా దిగజారాయో చెప్పడానికి శాసనసభే నిదర్శనమని లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ఆయన ప్రజలు ఎన్నుకున్న సభలే కళావిహీనంగా మారాయని, శాసనసభలో అరాచకత్వం రాజ్యమేలుతోందని వ్యాఖ్యానించారు. అధికార పక్ష సభ్యులే సభను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జేపీ అన్నారు. అధికారం ఉంటే ఏం చేసినా చెల్లుతుందా అని ఆయన ప్రశ్నించారు. విభిన్న ప్రాంతా ప్రయోజనాలకు సమన్వయం చేసే వేదికలు లేకుండా పోయాయని, ఏదో రూపంలో ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడుపుపకోవడమే నేతల లక్ష్యంగా మారిందని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుగడ్డ బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలాగా మారుస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *