హైదరాబాద్ : ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాల్సిందిపోయి శ్రేణి తగ్గించడం తగదని డీఆర్‌డీవో సాంకేతిక అధికారుల సంఘం ఆక్షేపించింది. దేశవ్యాప్తంగా 58 ప్రయోగశాల్లో పని చేస్తున్న వందలాది మంది సాంకేతిక అధికారుల శ్రేణి తగ్గించి, వేతనాల్లో కోత పెడుతున్నారని, సంఘ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో పదవీ విరమణ చేసి పెన్షన్లు పొందేవారూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. దీనికి నిరసనగా వారం రోజులపాటు ఆందోళన కార్యమ్రాలు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 9,10 తేదీల్లో కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఎల్ ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.




