Tuesday, 3 November 2026

సోనియా గాంధీ ప్రస్తావన వెనక్కి తీసుకోవాలి: జానారెడ్డి

హైదరాబాద్‌ : సభలో సోనియాగాంధీ ప్రస్తావన వెనక్కి తీసుకోవాలని మంత్రి జానారెడ్డి అన్నారు. 8 మంది కోట్ల ప్రజల అభిప్రాయాలను సభ్యులు స్వేచ్ఛగా తెలుపుకోవచ్చని, 8 మంది కోట్ల ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడాలని ఆయన అన్నారు. ఇతరులను కించపరిచే విధంగా మాట్లాడడం పద్ధతి కాదని, పరుషపదాలు ఉపయోగించడం సరికాదని ఆయన అన్నారు. విభజనకు కారణం ఎవరనే అంశంపై మాట్లాడాల్సి వస్తే చాలా పేర్లు వస్తాయని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *