హైదరాబాద్ : సమైక్య ముసుగులో వైకాపా,తెదేపా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాయని తెరాస ఎమ్మెల్యేలు ఆరోపించారు. రాష్ట్రపతి ఇచ్చిన సమయాన్ని వృథా చేసుకుని… ఇప్పుడు కొత్తగా మరింత గడువు కావాలని కోరుతున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తమ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని, సీమాంధ్ర హక్కుల కోసం ఇప్పటికైనా ఆ ప్రాంత నేతలు మాట్లాడకపోతే ప్రజలు నిలదీస్తారని తెరాస ఎమ్మెల్యేలు ఆ ప్రాంత నేతలు మాట్లాడకపోతే ప్రజలు నిలదీస్తారని తెరాస ఎమ్మెల్యేలు రాజయ్య, జోగి రామన్న వ్యాఖ్యానించారు.




