Tuesday, 3 November 2026

శాసన సభలో గందరగోళం

హైదరాబాద్‌ : బిల్లుపై చర్చ సందర్భంగా తెరాస పక్షనేత ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యల పై ప్రభుత్వ వివ్‌ ద్రోణం రాజు శ్రీనివాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకముందే ఇలా ప్రవర్తిస్తున్నారు…రాష్ట్రం విడిపోతే సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. ద్రోణం రాజు వ్యాఖ్యలపై తెరాస ఆగ్రహం వ్యక్తం చేసింది. పోటాపోటీ వ్యాఖ్యలతో శాసనసభలో గందరగోళం నెలకొంది. ఈ దశలో ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క జోక్యం చేసుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయవద్దని సూచించారు. దీంతో సభ్యులు శాంతించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *