పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజక వర్గంలోని వడ్లమూడి విఙ్ఞాన విశ్వవిద్యాలయంలో శుక్రవారం విఙ్ఞాన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విఙ్ఞాన మహోత్సవ పుస్తకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్ డైరెక్టర్ సునీల్ కుమార్ పాల్గొన్నారు.




