హైదరాబాద్ : తెరాస ఎమ్మెల్యేలు మావాళ్ల వద్దకు వచ్చి బెదిరించడం పద్ధతి కాదని శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి శైలజానాథ్ అన్నారు. ప్రభుత్వ వివ్ ద్రోణం రాజు శ్రీనివాస్ మాట్లాడుతుండగా తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఆయన వద్దకు దూసుకు రావడంతో గాదె వెంకటరెడ్డి అడ్డుకున్నారు. దీనిపై మంత్రి శైలజానాథ్ స్పందిస్తూ …శాసనసభలో సభ్యుల రక్షణ బాధ్యత స్పీకర్దేనన్నారు. తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీరుపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఆక్షేపించారు. అనంతరం ఈటెల రాజేందర్ మాట్లాడుతూ …తమ సభ్యుల ప్రవర్తన పై చింతిస్తున్నట్లు చెప్పారు.




