హైదరాబాద్ : శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా తెరాస నేత ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈటెల మాట్లాడుతూ … అడ్వకేట్ జనరల్ పదవి తెలంగాణ వ్యక్తికి ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై సీఎం స్పందిస్తూ …. తెలంగాణ నుంచి సీఎం అయిన వారు అడ్వకేట్ జనరల్ పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పీవీ నరసింహారావును మీరు గెలిపిస్తారన్న నమ్మకం లేకనే మా ప్రాంతంలో గెలిపించామని వ్యాఖ్యానించారు.




