హైదరాబాద్ : శాసనసభలో విభజన బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు ప్రస్తావన తెచ్చారు.దీనిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ .. తెలుగువాడు ప్రధాని అయ్యేందుకు నంద్యాలలో తమ పార్టీ పోటీ పెట్టలేదన్నారు. పీవీ చనిపోతే కాంగ్రెస్ వాళ్లు పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా పీవీ అంత్యక్రియలు సక్రమంగా చేయలేదన్నారు. పీవీకి ఢిల్లీలో ఘాట్ ఎందుకు నిర్మించలేదని.. కాంగ్రెస్ వాళ్లు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఆరు నెలలు ప్రధానిగా చేసిన వారికి ఢిల్లీలో ప్రత్యేక ఘాట్‌లు ఉంటే తెలుగువాడికి ఘాట్ లేదన్నారు. పీవీకి జరిగిన అన్యాయం .. తెలుగు వారికి జరిగిన అన్యాయమని చంద్రబాబు పేర్కొన్నారు.




