హైదరాబాద్ : సభలో చరిత్ర వక్రీకరణ వినే దౌర్భాగ్యం కలిగిందని శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి శైలజానాథ్ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా సీపీఐ సభ్యుడు గుండా మల్లేశ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి శైలజానాథ్ అభ్యంతరం తెలిపారు. అత్యంత సెక్యులర్ ప్రభువు నిజాం అని కీర్తించడం తనను బాధించిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాట అమర వీరుల త్యాగాలను విస్మరించవద్దని శైలజానాథ్ విఙ్ఞప్తి చేశారు. ఓట్లు, సీట్ల కోసం ప్రయత్నించవచ్చు కానీ, చరిత్రను వక్రీకరించొద్దని కోరారు.




