హైదరాబాద్ : శాసనసభలో సీపీఐ సభ్యులు గుండా మల్లేశ్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అది తనకు, తమ అధిష్ఠానానికి సంబంధించిన విషయమని సీఎం పేర్కొన్నారు. తాను అధిష్ఠానం నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ సభకు చెబుతానని ఆయన అన్నారు.




