హైదరాబాద్: దేశంలోని అన్ని సమస్యలకు మూలం కాంగ్రెస్సేనని భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమక్శించారు. భాజపా మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్న ఆయన ప్రసంగిస్తూ దేశంలో ప్రధాన సమస్యలకు కారణమైన కాంగ్రెస్‌ను గద్ద దింపాలని పిలుపునిచ్చారు. మజ్లిస్‌ను వ్యతిరేకించినంత మాత్రాన ముస్లింలకు భాజాపా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముస్లింలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.




