Wednesday, 4 November 2026

వారసత్వ ఉద్యోగాల పోరాటం ఆగదు

ఆదిలాబాద్‌,జనవరి16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు సాధించే వరకు తమ పోరాటం ఆగదని సింగరేణి వారసత్వ ఉద్యోగ పోరాట సాధన సమితి ప్రధాన కార్యదర్శి పి.సురేష్‌కుమార్‌ అన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినా ఇప్పుడు ఆపివేయడం వల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. వీరందరికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని అన్నారు. ఆయా కుటుంబాలకు ఉద్యోగాల కల్పనను మానవతా దృక్పథతంతో చూడాలన్నారు. సింగరేణిలో 15 ఏళ్ళ క్రితం వారసత్వ ఉద్యోగాలు తొలగించడంతో నిరుద్యోగ సమస్య గణనీయంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1999 నుంచి ఇప్పటి వరకు పదవీ విరమణ, వీఆర్‌ఎస్‌ పొందిన కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపరితల గనుల్లో ముంపునకు గురవుతున్న బాధితులకు తగిన న్యాయం చేయాలన్నారు.ఉద్యోగాలు ఇవ్వడంలో ఉన్న ఆంక్షలను ఎత్తేయాలన్నారు. ఇందుకోసం తాము చేస్తున్న పోరాటాన్ని మరింతగా ముందుకు తీసుకుని వెళతామన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *