హైదరాబాద్: సభలు, సమావేశాలు నిర్వహించడం పై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో పోలీసు ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఇవాళ నగర సీపీ అనురాగ్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఈ నెల 20 నుంచి 26 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.సైబరాబాద్‌లో 27 వరకు సభలు ప్రదర్శనలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు.




