Tuesday, 3 November 2026

బిజెపితో పొత్తు ఖాయం : ఎంపీ రాథోడ్‌

ఆదిలాబాద్‌,జనవరి20: బిజెపితో టిడిపి పొత్తు ఖాయమని, కేంద్రంలో మోడీ ప్రధాని, రాష్ట్రంలో  చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం తథ్యమని తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ అన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశ బిల్లుపెడితే తాము మద్దతిస్తామన్న మాటకు టిడిపి కట్టుబడి ఉందన్నారు. తాను పార్టీ మారుతాననే ప్రచారం అవాస్తవమని ఎంపీ చెప్పారు.  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని తెలిసి తమపై దుష్పచ్రారం చేస్తున్నారని  అన్నారు.  తాను ఏపార్టీలోకి వెళ్లలనని  కార్యకర్తల, ప్రజల అండ ఏపార్టీ నాయకులకు లేదన్నారు. ఎదుటిపార్టీలో అసలు పోటీకి నిలిచే సమర్ధుడైన నాయకుడు లేరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాలోని అన్నిగ్రామాలతో అనుబంధం, సమస్యలు తీర్చాల్సినవి తనకు తెలుసన్నారు. వలసవాదులను ప్రజలు ఆదరించరని, కాంగ్రెస్‌ దోపిడీని ప్రజలకు కార్యకర్తలు వివరించాలన్నారు. ఎన్నికల్లో గెలిచాక సంపాదించేది ప్రజలకేనని, ప్రజాసమస్యలు అన్నీ తెలుసుకున్నవాడిని సమస్యలన్నీ తీర్చేస్తానన్నారు. తెరాస, కాంగ్రెస్‌ వైఫల్యాలను టిడిపి చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు కార్యకర్తలు వివరించాలని సూచించారు. ఇక టిడిపి చేసిన అభివృద్ది పనులే వచ్చే ఎన్నికల్లో తమ ప్రచార అస్త్రాలని అన్నారు. కాంగ్రెస్‌ అవినీతిని ప్రచారం  చేస్తమాన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *