Tuesday, 3 November 2026

ఓటింగ్‌ జరిగితే చంద్రబాబు బండారం బట్టబయలు

విశేషాధికారాలను తొక్కిపెడుతున్న స్పీకర్‌
టిడిపిపై మండి పడ్డ వైసిపి
హైదరాబాద్‌,జనవరి 20: రాష్ట్ర విభజన అంశంపై సభలో సమైక్య తీర్మాణం చేయాలన్నా, దీనిపైన ఓటింగ్‌ నిర్వహించాలన్నా కూడా చంద్రబాబు అసలు రంగు బయట పడుతుందనే భయంతో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తోందని వైసిపి తీవ్ర స్థాయిలో ఆరోపించింది. సభలో ఓటింగ్‌ అంశంపై ఖచ్చితమైన హామినివ్వాలని తాము స్పీకర్‌పై ఒత్తిడి చేస్తుంటే మధ్యలో టిడిపి భుజాలు తడుముకుంటూ తమనే నింధించడం వారి అవివేకానికి నిదర్శనమని వైసిపి నేతలు అన్నారు. స్పీకర్‌కున్న విశేషాధికారాలను వినియోగించుకుని రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించాలని, ఆతర్వాత ఎంతసమయమైనా చర్చించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. తమ వాదనను అర్థం చేసుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది పోయి తమనే నిందిస్తారా అంటా వైసిపి ఎమ్మెల్యేలు టిడిపి నేతలను దుయ్యబట్టారు. అధికారపక్షంతో చేయి కలిపి విభజనకు సహకరిస్తున్నది టిడిపియేనని వారు ఆరోపించారు. తెలంగాణా ఏర్పాటుకు నూటికి వెయ్యిరెట్లు సహకరిస్తున్న టిడిపి సీమాంద్రలో ఉనికిని కాపాడుకునేందుకే ప్రయత్నిస్తోందని వైసిపి ఆరోపించింది. రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో ఓటింగ్‌ జరిగేవరకూ తాము పోరాడతామని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. సోమవారం ఉదయం సభ ప్రారంభం కాగానే  విభజన బిల్లుపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు కోరుతూ వెంటనే ఓటింగ్‌ నిర్వహించాలని వైఎస్‌ఆర్‌ సీపీ డిమాండ్‌ చేసింది. అయితే స్పీకర్‌ నిరాకరించటంతో వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. సభా సమావేశాలను సజావుగా నడిచేలా సహకరించాలని స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టువీడలేదు. దాంతో స్పీకర్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు. సభా వాయిదా అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు కరుణాకర్‌ రెడ్డి, శోభా నాగిరెడ్డి తదితరులు విూడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ స్పీకర్‌కున్న విశేషాధికారాల గురించి తాము ప్రస్తావించినా …ఆయననుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. స్పీకర్‌ సభా సంప్రదాయాలను పాటించటం లేదని అన్నారు.  స్పీకర్‌ సభాముఖంగా తమకు హావిూ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఓటింగ్‌ జరిగితే చంద్రబాబు బండారం బయటపడుతుందని ….టీడీపీ డ్రామాలాడుతోందని వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత కాంగ్రెస్‌, టీడీపీ నేతలు పోజులే తప్ప పోరాటాలు చేయటం లేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్‌, టీడీపీ నేతలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *