Wednesday, 4 November 2026

శాసనసభ అరగంట వాయిదా

ఓటింగ్‌కోసం వైసిపి పట్టు
హైదరాబాద్‌, జనవరి 20 : రాష్ట్రఅసెంబ్లీ సమావేశాలుతిరిగి వాయిదాలతోనే సోమవారం ప్రారంభమైంది. రాష్ట్రవిభజన బిల్లుపై చర్చిం చేందుకు సమావేశం కావాల్సిన శాసనసభ ప్రారంభం కాగానే వైసిపి ఎమ్మెల్యేలు ఓటింగ్‌కోసం పట్టుబడుతూ స్పీకర్‌ పోడియంకు చేరుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిస్తూ స్పీకర్‌ ఖచ్చితమైన హామి నివ్వాలని డిమాండ్‌ చేశారు. ఈక్రమంలోనే వైసిపి ఇచ్చిన ఓటింగ్‌ వాయిదా తీర్మాణం, టిడిపి ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై స్పష్టం చేయాలన్న వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తున్నట్లు స్పీకర్‌ నాదేండ్ల మనోహర్‌ ప్రకటించారు. సభ్యులను ఎంత వారించినా కూడా వైసిపిఎమ్మెల్యేలు వినక పోవడంతో ఆగ్రహించారు. వైసిపి నుంచి కూడా ఇంకో ఇద్దరు మాట్లాడాల్సి ఉందని, ఇతర పార్టీల నేతలు కూడా మాట్లాడాల్సి ఉందన్నారు. ఇది జరుగకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఇతర సభ్యుల హక్కులను కాలరాయడం శోచనీయమన్నారు. సుమారు ఇరవై నిమిషాలు స్పీకర్‌ సబ్యులను వారించేందుకు  ప్రయత్నించినా కూడా వినక పోవడంతో సభను అరగంటసేపు  స్పీకర్‌ వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *