రాష్ట్రపతికి టీ ప్రజాప్రతినిధుల లేఖ
హైదరాబాద్, జనవరి 20: రాష్ట్ర విభజన బిల్లుపై శాసనసభలో చర్చకు గడువును పెంచొద్దని తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఇప్పటికే 42రోజులపాటు ముసాయిదా బిల్లుపై చర్చకు గడువు ఇచ్చారని, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు కావాలని విభజన ఆపేందుకు కుట్రతో కాలయాపన చేశారని వారు పేర్కొన్నారు. ముసాయిదా బిల్లుపై చర్చ కేవలం ఒకటి రోజులు మాత్రమే జరిగిందని, ముఖ్యమంత్రి కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో లేఖ రాయించారని, ఇప్పటికే శాసనసభ్యులంతా రాతపూర్వకతంగా తమ అభిప్రాయాలు తెలిపినందున, ఇక సభలో చర్చించాల్సిన అవసరం లేదని, అందువల్ల బిల్లుపై గడువు విధించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.




