హైదరాబాద్: ఓ అవినీతి టౌన్‌ప్లానింగ్ అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఎల్బీనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి రామచంద్ర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయన నివాసాలపై ఏక కాలంలో దాడులు చేశారు. హైదరాబాద్, వరంగల్, యాదగిరిగుట్ట తదితర ప్రాంతాల్లో ఉన్న ఆయన నివాసాలలో సోదాలు నిర్వహించారు. కోట్లరూపాయల ఆస్తులు ఉన్నట్లు ప్రాధమిక విచారణలో వెల్లడైందని అధికారులు వెల్లడించారు.




